Wednesday, September 9, 2026

Date: 2026-09-09
🧠 విశాఖపట్నంలో తొలిసారిగా "సమగ్ర న్యూరో ల్యాబ్" ప్రారంభం! 🏥✨
నరాల సంబంధిత వ్యాధుల నిర్ధారణకు అవసరమైన అన్ని రకాల అధునాతన పరీక్షలు ఇప్పుడు విశాఖలోని కిమ్స్ ఐకాన్ (KIMS ICON) హాస్పిటల్ లో ఒకే చోట అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పటివరకు ఈ ప్రత్యేక న్యూరో పరీక్షల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇకపై విపత్తు లేదా అత్యవసర సమయాల్లో కూడా 24 గంటల పాటు ఈ సేవలు విశాఖలోనే అందుబాటులో ఉంటాయి.
న్యూరో ల్యాబ్‌లో అందుబాటులో ఉన్న అధునాతన పరీక్షలు:
• NCS, VEP, BAEP, RNST
• EMG, వీడియో EEG, TCD మరియు ఇతర ముఖ్యమైన పరీక్షలు.
ఈ ల్యాబ్‌ను ఇండియన్ నేవీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాజీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై. జవహర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఐకాన్ ఎండీ డాక్టర్ సతీష్ కుమార్ పేతకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి బలరామ కృష్ణ, డాక్టర్ నగేశ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిహెచ్. విజయ్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.